- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జకోవిచ్‌ను ఇంటికి పంపిన మాటియో బెరెట్టిని
2023 తర్వాత టాప్-10 ఆటగాడిపై బెరెట్టిని గెలవడం ఇదే మొదటి సారి.

- ఖతార్ ఓపెన్ తొలి రౌండ్‌లో జకోవిచ్ ఓటమి
దిశ, స్పోర్ట్స్: దోహా వేదికగా జరుగుతున్న ఖతార్ ఎక్సాన్ మొబిల్ ఓపెన్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఇంటిదారి పట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇటలీకి చెందిన మాటియో బెరెట్టిని 7-6(4), 6-2 తేడాతో జకోవిచ్‌ను ఓడించాడు. మాటియో బెరెట్టిని కెరీర్‌లో జకోవిచ్‌ను ఓడించడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. 2023 తర్వాత టాప్-10 ఆటగాడిపై బెరెట్టిని గెలవడం ఇదే మొదటి సారి. ఇక ఆస్ట్రేలియాకు చెందిన నంబర్ 2 సీడ్ అలెక్స్ డి మనౌర్ రష్యాకు చెందిన రోమన్ సఫియుల్లిన్‌ను 6-1,7-5 తేడాతో ఓడించాడు. ఇక నంబర్ 4 సీడ్ ఆటగాడు డానియల్ మెద్వెదేవ్ డిఫెండింగ్ చాంపియన్, తోటి రష్యా ఆటగాడు కరెన్ ఖచనోవ్‌ను 4-6, 7-5, 6-3 తేడాతో ఓడించాడు. రష్యన్ ఐదో సీడ్ ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్.. కజకిస్తాన్‌కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్‌ను 6-3, 6-4 తేడాతో ఓడించాడు. ఇక సెర్బియాకు చెందిన హమద్ మెడ్జెడోవిచ్ 7-6(6), 5-7, 7-6(5) తేడాతో గ్రీస్‌కు చెందిన ఆరో సీడ్ ఆటగాడు స్టెఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు. వీరిద్దరి మధ్య మ్యాచ్ రెండు గంటల నలబై అయిదు నిమిషాల పాటు జరగడం గమనార్హం. ఇక పోర్చుగల్‌కు చెందిన నూనో బోర్జెస్, ఇటలీకి చెందిన లుకా నార్డి, టాలన్ గ్రీక్స్‌పూర్, నెదర్లాండ్ ఆటగాడు బోటిక్ వాన్ డి, బెల్జియం ఆటగాడు జిజౌ బెర్గ్స్, కెనడియన్ ఫిలిక్స్ అగర్-అలియాసిమ్‌లు కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు.






