- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్-2026 నుంచి రూ.18 కోట్ల ప్లేయర్ ఔట్ !
ఐపీఎల్ 2026 సీజన్ నుంచి రూ. 18 కోట్ల ప్లేయర్ మతీషా పతిరనా దూరమయ్యే ప్రమాదం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కంటే ముందే కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే సీజన్ నుంచి రూ. 18 కోట్ల ప్లేయర్ మతీషా పతిరనా ( Matheesha Pathirana) దూరమయ్యే ప్రమాదం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన శ్రీలంక ఆటగాడు మతీషా పతిరనా ఇంకా గాయం నుంచి రికవరీ కాలేదని తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. అంటే కేవలం 17 రోజుల సమయం మాత్రమే ఐపీఎల్ ప్రారంభానికి ఉంది. ఇంత తక్కువ సమయంలో మతీషా పతిరనా కోలుకొని బరిలోకి దిగడం కష్టమే అని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నుంచి మతీషా పతిరనా దూరం కావడం గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు.
ఎడమ కాలు కండరాల నొప్పితో టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి మధ్యలోనే మతీషా పతిరనా వైదొలిగాడు. ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఒకవేళ మతీషా పతిరనా కోలుకుంటే టోర్నమెంట్ మధ్యలో జట్టులో చేరే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ మినీ వేలంలో రూ.18 కోట్లకు శ్రీలంక ఆటగాడు మతీషా పతిరనాను కేకేఆర్, కొనుగోలు చేసింది. అంతకు ముందు 2023 నుంచి 2025 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగాడు. చెన్నైలో మతీషా పతిరనాకు రూ.13 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. కానీ కేకేఆర్ 18 కోట్లకు కొనుగోలు చేసి అతనిపై అంచనాలు పెంచింది. కానీ ఇప్పుడు గాయం కారణంగా మతీషా పతిరనా టోర్నమెంట్ నుంచి దూరమైతే మరో ప్లేయర్ ను చూసుకోవాల్సిన పరిస్థితి కేకేఆర్ ముందు ఉంది. ఇప్పటికే ముస్తాఫిజుర్ రహమాన్ పైన వేటుపడిన సంగతి తెలిసిందే.






