Qualifier 2: వరుణుడి ఎంట్రీ..ముంబై, పంజాబ్ మ్యాచ్ కు బ్రేక్ !

by velandi.Saikiran |   (  Updated:2025-06-01 14:22:05  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... ఇవాళ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భాగంగా ముంబై

Qualifier 2: వరుణుడి ఎంట్రీ..ముంబై, పంజాబ్ మ్యాచ్ కు బ్రేక్  !
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... ఇవాళ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్వాలిఫైయర్ 2 లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో.... వర్షం విలన్ గా మారింది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు... వర్షం ప్రారంభమైంది. దీంతో ప్లేయర్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉండిపోయారు.

అంతకుముందు పంజాబ్ కింగ్స్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసేందుకు ముంబై ఇండియన్స్ రెడీ అయింది. బ్యాటర్లు రంగంలోకి దిగే లోపు... వర్షం ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ వర్షం ఇలాగే కొనసాగి మ్యాచ్ రద్దు అయితే... పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి వెళుతుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కు రిజర్వుడే లేదు. కేవలం ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే... రిజర్వ్ డే ఉంది.

అంటే ఇవాల్టి మ్యాచ్ రద్దు అవుతే... పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి వెళ్లి... బెంగళూరు తో తలపడుతుంది. ఒకవేళ వర్షం.. ఆగిపోతే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇవాల్టి మ్యాచ్ కు గంట సమయం ఎక్కువగానే కేటాయించారు. ఇప్పటికే దీనిపై బీసీసీఐ కూడా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంటే అర్ధరాత్రి అయినా కూడా మ్యాచ్ నిర్వహిస్తారు. పూర్తిగా ఆడలేని పరిస్థితి ఉంటే రద్దు చేస్తారు. మ్యాచ్ రద్దు అయితే మాత్రం ముంబై ఇండియన్స్ కు షాక్ తగులుతుంది.

Next Story