నేడే న్యూజిలాండ్, భార‌త్ తొలి వ‌న్డే..ఆ డేంజ‌ర్ ప్లేయ‌ర్ దూరం

by velandi.Saikiran |

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఈ రెండు జట్లు తొలి మ్యాచ్ లో తలపడతాయి. వడోదరలోని BCA స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు.

నేడే న్యూజిలాండ్, భార‌త్ తొలి వ‌న్డే..ఆ డేంజ‌ర్ ప్లేయ‌ర్ దూరం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఈ రెండు జట్లు తొలి మ్యాచ్ లో తలపడతాయి. వడోదరలోని BCA స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇండియాలోనే మ్యాచ్ జరుగుతోంది కాబట్టి, మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మెడ నొప్పితో జట్టుకు దూరమైన గిల్, మళ్లీ కెప్టెన్సీ తీసుకోనున్నాడు. ఈ మ్యాచ్ తోనే రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

రిష‌బ్ పంత్ కు తీవ్ర గాయం

అటు ఆస్ట్రేలియా గడ్డపై గాయం మారిన పడ్డ శ్రేయస్ అయ్యర్ కూడా తిరిగి జట్టులో చేరిపోయాడు. నేటి మ్యాచ్ కూడా ఆడనున్నాడు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎప్పటిలాగే తమ పాత్ర పోషించనున్నారు. చాలా రోజుల తర్వాత మహమ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి వచ్చాడు. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు భారత జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

నిన్న ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పంత్ కు తీవ్ర గాయమైంది. దీంతో అతడు ఈ టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ కూడా ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో జురెల్ లేదా ఈషాన్ కిషన్ వచ్చే ఛాన్స్ ఉందట. ప్రస్తుతానికైతే కే ఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా చేస్తున్నాడు. కాబట్టి పంత్ గాయం భారత్ కు పెద్ద పెద్ద నష్టం చేయబోదని అంటున్నారు.

Next Story