క్రికెట్లో మరో సంచలనం.. 5 బంతుల్లో మ్యాచ్ ముగింపు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-11 17:07:22  IST  )

క్రికెట్ చరిత్రలో మరో క్రేజీ రికార్డ్ నమోదైంది. కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ముగియడం క్రికెట్లో చరిత్ర సృష్టించింది.

క్రికెట్లో మరో సంచలనం.. 5 బంతుల్లో మ్యాచ్ ముగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్ చరిత్రలో మరో క్రేజీ రికార్డ్ నమోదైంది. కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ముగియడం క్రికెట్లో చరిత్ర సృష్టించింది. అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫైయర్ 2025లో ఈ సంచలనం నమోదైంది. కెనడా, అర్జెంటీనా మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా 19 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయింది. జట్టులో ఏకంగా ఏడుగురు డక్ ఔట్ అవడం విశేషం. కెనెడా బౌలర్ జగ్ మన్ దీప్ 7 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి అర్జెంటీనా బ్యాటర్స్ కు చుక్కలు చూపించాడు.

అనంతరం బరిలోకి దిగిన కెనెడా కేవలం మొదటి ఓవర్లోని 5 బాల్స్ లోనే 24 పరుగులు చేసి టార్గెట్ చేధించింది. కెప్టెన్, ఓపెనర్ యువర్జ్ ఒక్కడే 2 సిక్సులు, 2 ఫోర్లు బాది మ్యాచ్ ముగించాడు. పొట్టి క్రికెట్లో అత్యంత స్వల్ప స్కోర్, దాన్ని కూడా అత్యల్ప బంతుల్లో చేధించిన మ్యాచ్ ఇదేనంటూ క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story