- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంభీర్ భారత జట్టుకు కోచ్‌గా ఉండటం దురదృష్టకరం : మనోజ్ తివారీ
భారత టెస్టు జట్టుకు స్పెషల్ కోచ్ ఉండాల్సిన అవసరం ఉందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత టెస్టు జట్టుకు స్పెషల్ కోచ్ ఉండాల్సిన అవసరం ఉందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్‌పై అవడంపై తివారీ స్పందించాడు. ఓ జాతీయ మీడియాతో మనోజ్ మాట్లాడుతూ..‘పరిస్థితులు సరిగా జరగడం లేదు. వారు అనుసరిస్తున్న వ్యూహాలు సరైనవి కావు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, గతేడాది న్యూజిలాండ్, ఇప్పుడు సౌతాఫ్రికాతో అవే జరిగాయి. చాలా మార్పులు జరగాలి.’అని తెలిపాడు. టెస్టు జట్టుకు వేరే ఎవరైనా కోచ్ అవసరమా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. కచ్చితంగా అవసరం ఉందన్నాడు. భారత టెస్టు క్రికెట్‌ను కాపాడటానికి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవాలన్నాడు.
అలాగే, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు గుప్పించాడు. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ డ్రా అయినప్పుడు కూడా తానే కోచ్ అన్న గంభీర్ వ్యాఖ్యలను తప్పుబట్టాడు. ‘ఇంగ్లాండ్‌తో డ్రా అనేది భారత జట్టుకు గొప్ప విషయం కానే కాదు. ఇక చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచిన జట్లను రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ అంతకుముందు కోహ్లీ నిర్మించారు. గంభీర్ కోచ్ కాకముందే ఆ జట్లు తయారయ్యాయి. గంభీర్ తన పదవీకాలంలో ఇప్పటివరకు గొప్ప విజయాలు సాధించలేదు.’అని మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైట్‌బాల్ మెంటర్ భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఉండటం దురదృష్టకరమని, గ్రౌండ్ లెవల్‌లో అనుభవం లేనప్పుడు అత్యుత్తమ ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించాడు.






