బుమ్రానే కాదు.. సిరాజ్‌ను కూడా అలాగే చూడాలి : ఆర్పీ సింగ్

by Harish |

జస్ప్రిత్ బుమ్రాలాగానే మహ్మద్ సిరాజ్‌ వర్క్‌లోడ్‌ను పర్యవేక్షించాలని భారత మాజీ పేసర్ ఆర్పీసింగ్ బీసీసీఐకి సూచించాడు.

బుమ్రానే కాదు.. సిరాజ్‌ను కూడా అలాగే చూడాలి : ఆర్పీ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : జస్ప్రిత్ బుమ్రాలాగానే మహ్మద్ సిరాజ్‌ వర్క్‌లోడ్‌ను పర్యవేక్షించాలని భారత మాజీ పేసర్ ఆర్పీసింగ్ బీసీసీఐకి సూచించాడు. ఓ జాతీయ మీడియాతో ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. సిరాజ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన, భవిష్యత్తులో అతను గాయపడకుండా ఉండేందుకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ చాలా కీలకమన్నాడు. ‘ఫాస్ట్ బౌలర్లు తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల గాయపడే ప్రమాదం ఉంటుంది. బుమ్రా విషయంలో అనుసరిస్తున్న వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌నే సిరాజ్ విషయంలో కూడా పాటించాలి. మెరుగైన వర్క్‌లోడ్ కారణంగా బుమ్రా వన్డే, టీ20 వరల్డ్ కప్‌లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ విషయంలో కూడా అదే విధానాన్ని అవలంభించాలి. గాయాల నుంచి అతన్ని కాపాడాలి. అతని వర్క్‌లోడ్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాలి.’అని ఆర్పీ సింగ్ సూచించాడు. ‘బ్యాటర్లకు ఎలా అయితే భాగస్వామ్యాలు అవసరమో బౌలర్లు కూడా జంటగా బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు. బుమ్రా తన ప్రత్యేకమైన యాక్షన్‌తో వికెట్లు తీశాడు. ఇక, సిరాజ్ బ్యాటర్లపై ఒత్తిడి తెస్తాడు. బుమ్రా, సిరాజ్ జోడీ ప్రత్యేకమైనది. బుమ్రా జట్టులో లేకపోతే ఆటోమేటిక్‌గా సిరాజే బౌలింగ్ దళానికి నాయకుడు.’అని ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.


Next Story