- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైభవ్ సూర్యవంశీ తోక కట్ చేస్తాం..మలేషియా వార్నింగ్ !
యూఏఈపై సెంచరీ సాధించిన వైభవ్ తోక కట్ చేస్తామని మలేషియా వార్నింగ్ ఇస్తోంది. పాకిస్తాన్ కట్టడి చేసినట్లుగానే వైభవ్

దిశ, వెబ్ డెస్క్: పురుషుల అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ భారత్, మలేషియా జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. దుబాయ్ లోని ది సెవెన్స్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో, భారత జట్టుకు చెందిన వైభవ్ సూర్యవంశీకి మలేషియా జట్టు వార్నింగ్ ఇచ్చింది.
ఈ టోర్నమెంట్ లో యూఏఈపై సెంచరీ సాధించిన వైభవ్ తోక కట్ చేస్తామని మలేషియా వార్నింగ్ ఇస్తోంది. పాకిస్తాన్ కట్టడి చేసినట్లుగానే వైభవ్ సూర్యవంశీని తాము కూడా తొందరగానే ఔట్ చేస్తామని మలేషియా కెప్టెన్ డీయాజ్ పాత్రో వెల్లడించారు. అతని కోసం కొత్త బిగ్ స్కెచ్ వేసామని వివరించారు. ఈ దెబ్బకు తొందరగానే వైభవ్ సూర్యవంశీ ఔట్ కాబోతున్నట్లు మలేషియా కెప్టెన్ వెల్లడించారు. కాగా పాకిస్తాన్ పై 5 పరుగులకే వైభవ్ వికెట్ సమర్పించుకున్నాడు.






