Kidambi Srikanth : మలేషియా మాస్టర్స్.. రన్నరప్‌గా శ్రీకాంత్

by Muthe.Rajitha |

మలేషియా మాస్టర్స్ 2025(Malaysia Masters 2025) బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో రన్నరప్‌(Runner-up)గా నిలిచాడు.

Kidambi Srikanth : మలేషియా మాస్టర్స్.. రన్నరప్‌గా శ్రీకాంత్
X

దిశ, వెబ్ డెస్క్ : మలేషియా మాస్టర్స్ 2025(Malaysia Masters 2025) బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో రన్నరప్‌(Runner-up)గా నిలిచాడు. నేడు చైనా ప్లేయర్ లీ షి ఫెంగ్‌తో 21-11, 21-9 స్కోరుతో ఓడిపోయి రెండవ స్థానంలో నిలిచాడు. లీ షి ఫెంగ్ బలమైన ఆటతీరు, శ్రీకాంత్ చాలా ఎర్రర్స్ కారణంగా ఓటమిపాలు కావాల్సి వచ్చింది. గతంలో ఈ ఇద్దరూ నాలుగుసార్లు తలపడగా శ్రీకాంత్ ఒక్కసారి మాత్రమే గెలిచాడు.

శ్రీకాంత్.. ప్రపంచ ర్యాంకింగ్‌లో 65వ స్థానంలో ఉన్నప్పటికీ, క్వాలిఫైయర్‌గా టోర్నమెంట్‌లోకి వచ్చి, జపాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, చైనా దేశాలకు చెందిన టాప్ ప్లేయర్స్ ను ఓడించి ఫైనల్‌కు చేరాడు. టైటిల్ గెలవలేకపోయినా ఈ ప్రదర్శన శ్రీకాంత్ ర్యాంకింగ్‌ను మెరుగుపరచకోడానికి, భవిష్యత్ టోర్నమెంట్‌లలో విజయాలకు ఊతమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Next Story