ఫైనల్‌లో చైనా షట్లర్ చిత్తు.. మలేసియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన హెచ్‌ఎస్ ప్రణయ్..

by Disha Web Desk 13 |
ఫైనల్‌లో చైనా షట్లర్ చిత్తు.. మలేసియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన హెచ్‌ఎస్ ప్రణయ్..
X

దిశ, వెబ్‌డెస్క్: మలేసియా మాస్టర్స్ 2023 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-19, 13-21, 21-18 తేడాతో చెనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం ప్రణయ్ తీవ్రంగా శ్రమించాడు. ప్రణయ్ అసాధారణ ఆటతో ఆధిపత్యం చెలాయించి తొలి గేమ్‌‌లో గెలుపొందాడు. రెండో గేమ్‌లో చైనా షట్లర్ ధీటుగా బదులివ్వడమే కాకుండా ప్రణాయ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. దాంతో ఫలితం డిసైడర్ గేమ్‌‌పై ఆధారపడగా.. ప్రణయ్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా చెలరేగాడు. ప్రత్యర్థి జోరు కనబర్చినా చాకచక్యంగా ఆడి గేమ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు టైటిల్‌ను ముద్దాడాడు.

ఇదే టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో వెనుదిరగ్గా.. శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారపట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రణయ్ అసాధారణ ఆటతో టైటిల్ గెలిచాడు. శనివారం మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ఆరో సీడ్‌ సింధు 14-21, 17-21తో ఏడో సీడ్‌ మరిస్కా టాన్‌జంగ్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడింది.


Next Story

Most Viewed