నార్వే చెస్ టోర్నీ విజేతగా మాగ్నస్ కార్ల్‌సన్.. మూడో స్థానంలో నిలిచిన గుకేశ్

by Kema Shiva Kumar |

అత్యంత ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టోర్నమెంట్ -2025 (Norway Chess Tournament-2025) విజేతగా మాగ్నస్ కార్ల్‌సన్ (16) నిలిచాడు.

నార్వే చెస్ టోర్నీ విజేతగా మాగ్నస్ కార్ల్‌సన్.. మూడో స్థానంలో నిలిచిన గుకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టోర్నమెంట్ -2025 (Norway Chess Tournament-2025) విజేతగా మాగ్నస్ కార్ల్‌సన్ (Magnus Carlsen) నిలిచాడు. చివరి వరకు పోరాడిన గుకేశ్ దొమ్మరాజు మూడో స్థానానికే పరిమితమయ్యాడు. తొమ్మిదో రౌండ్ వరకు 14.5 పాయింట్లలో రెండో స్థానంలో ఉన్న గుకేశ్ దొమ్మరాజు (Gukesh Dommaraju) పదో రౌండ్‌లో ఓడిపోయాడు. దీంతో అతడు మూడో స్థానానికి పడిపోయాడు. ఇక మహిళల విభాగంలో కోనేరు హంపి (Koneru Hampi) మూడో స్థానంలో నిలిచింది.

ఈ సందర్భంగా విజేత మాగ్నస్ కార్ల్‌సన్ మాట్లాడుతూ.. టోర్నమెంట్‌లో గెలిచినందుకు చాలా సంతోషంతో పాటు తనకు ఉపశమనం లభించిందని అన్నారు. టోర్నీ చివరి భాగం ఓ రోలర్‌కోస్టర్ లాంటిదని.. అన్ని పరిణామాలను అధిగమిస్తేనే విజయం తన సొంతమైందని కామెంట్ చేశారు. ఇక ఇండియాన నుంచి పోటీలో పాల్గొన్న గుకేష్ దొమ్మరాజు, అర్జున్ ఎరిగైసి (Arjun Erigaisi) మాట్లాడుతూ.. టోర్నీలో ప్రతి ఒక్కరూ బాగా ఆడారని తెలిపారు. ఈ టోర్నీ తమకు చక్కని జ్ఞాపకంగా నిలుస్తుందని కామెంట్ చేశారు.

Next Story