IPL 2025 : చెలరేగిన లక్నో.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(LSG vs KKR) మధ్య ఈడెన్ గార్డెన్ స్టేడియం(Eden Garden Stadium) వేదికగా మ్యాచ్ జరుగుతోంది.

IPL 2025 : చెలరేగిన లక్నో.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(LSG vs KKR) మధ్య ఈడెన్ గార్డెన్ స్టేడియం(Eden Garden Stadium) వేదికగా మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన లక్నో బ్యాట్స్ మెన్స్ చెలరేగి పోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో జట్టులో నికోలస్ పూరన్ 87(5 సిక్సులు, 6 ఫోర్లు), మిచెల్ మార్ష్ 81, మార్క్రం 47 పరుగుల అద్భుత ప్రదర్శన చేశారు. కేకేఆర్ బౌలర్స్ లో హర్షిత్ 2, రస్సెల్ ఒక వికెట్ తీశారు. కాగా మరికొద్దిసేపట్లో 239 పరుగుల భారీ లక్ష్యంతో కోల్‌కతా బ్యాటింగ్ కు దిగనుంది.

Next Story