MI vs LSG : ముంబై చేతిలో లక్నో చిత్తు

by Muthe.Rajitha |

ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ముంబై(MI vs LSG) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

MI vs LSG : ముంబై చేతిలో లక్నో చిత్తు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ముంబై(MI vs LSG) చేతిలో చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 161 పరుగులకే ఆల్ ఔట్ అయింది. మిచెల్ మార్ష్ 34, నికోలస్ పూరన్ 27, ఆయుష్ బదోని 34, డేవిడ్ మిల్లర్ 24 పరుగులు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ముంబై బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) 4/22 తో లక్నోను దెబ్బ తీశాడు. ట్రెంట్ కూడా 3/20 తో LSG బ్యాటర్లను బెంబేలు ఎత్తించాడు. కాగా ఈ సీజన్(IPL 2025) ఆరంభంలో తడబడ్డ ముంబై వరుస విజయాలతో మళ్ళీ ఫాంలోకి వచ్చింది. లక్నోకి ఇది ఐదో ఓటమి.

Next Story