- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : LSG vs KKR ఐపీఎల్ మ్యాచ్.. పోరాడి ఓడిన కోల్‌కతా
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(LSG vs KKR) మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(LSG vs KKR) మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్ స్టేడియం(Eden Garden Stadium) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. 4 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
కేకేఆర్ జట్టులో రహానే 61, వెంకటేష్ అయ్యర్ 45, రింకు సింగ్ 38 పరుగులు చేసినా కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. లక్నో బౌలర్స్ లో ఆకాష్ దీప్ 2, శార్దూల్ 2, దిగ్వేష్ సింగ్, రవి, బిష్ణోయ్, అవేశ్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు ఇన్నింగ్స్ లో లక్నో బ్యాటర్స్ లో పూరన్ 87, మిచెల్ మార్ష్ 81, మార్క్రం 47 పరుగులు చేశారు.






