- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైభవ్ షాట్స్ చూసి షాకయ్యా.. 14 ఏళ్ల యువ సంచలనంపై శాంసన్ ప్రశంసలు
ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్, 14ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్, 14ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ క్రికెటర్ ఆర్. అశ్విన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. వైభవ్‌పై ప్రశంసలు కురిపించాడు. అతని షాట్స్‌కు ఫిదా అయ్యానని తెలిపాడు. ‘వైభవ్ తొలి బంతికే సిక్స్ కొట్టినప్పుడు అతనికి లక్ బాగా ఉందని అనుకున్నా. కానీ, ఆ తర్వాత అతను ఆడిన షాట్స్, ఆటతీరు నన్ను షాక్ గురి చేసింది. నెట్స్‌లోనూ దూకుడుగా ఆడేవాడు. వైభవ్ గురించి బట్లర్, జోఫ్రా ఆర్చర్ మాట్లాడుకునేవారు. 14 ఏళ్లకు కుర్రాడు ఆర్చర్ బౌలింగ్‌ను తేలికగా ఆడేయడం అద్భుతం.’అంటూ శాంసన్ ప్రశంసించాడు. అశ్విన్ కూడా వైభవ్ ఆటతీరును ప్రశంసించాడు. ‘వైభవ్ హిట్టింగే కాదు అతని టైమింగ్ కూడా బాగుంటుంది. ఒక బంతిని రౌండ్ ది స్టంప్స్ నుంచి సంధించా. దాన్ని కవర్స్ మీదుగా కొట్టాడు. భారీ షాట్ కొడతాని ఊహించి తర్వాతి బంతిని కాస్త స్లోగా వేశా. కానీ, అతను వేచి చూసి షాట్ ఆడాడు. ఈ కుర్రాడికి ఇంతటి ఓర్పు ఎలా వచ్చిందని అప్పుడు అనిపించింది. 18 ఏళ్ల క్రితం నేను ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశా. అతను 14 ఏళ్లకే అద్భుత నైపుణ్యం ప్రదర్శించాడు.’అని అశ్విన్ తెలిపాడు.






