మెస్సీ భారత్ పర్యటన ఖరారు.. ఎప్పుడు వస్తున్నాడంటే?

by Harish |

దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు, అర్జెంటీనాకు చెందిన లియోనల్ మెస్సీ భారత్‌కు వస్తున్నాడు.

మెస్సీ భారత్ పర్యటన ఖరారు.. ఎప్పుడు వస్తున్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు, అర్జెంటీనాకు చెందిన లియోనల్ మెస్సీ భారత్‌కు వస్తున్నాడు. మెస్సీ పర్యటనను అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్(ఏఎఫ్ఏ) శనివారం ధ్రువీకరించింది. మెస్సీ భారత్‌కు వస్తున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అతని పర్యటనపై అధికారిక ప్రకటన వచ్చింది. కేరళలో అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు వస్తుందని ఏఎఫ్‌ఏ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్‌కు ముందు అర్జెంటీనా ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. ‘అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు మేనేజర్ లియోనల్ స్కాలోని నేతృత్వంలో అర్జెంటీనా జట్టు రెండు ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్‌లో 6 నుంచి 14 మధ్య అమెరికాలో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత నవంబర్‌‌లో 10 నుంచి 18 మధ్య లాండా, అంగోలా, కేరళలో అర్జెంటీనా జట్టు పర్యటిస్తుంది. అప్పుడు రెండో స్నేహపూర్వక మ్యాచ్ ఆడతాం. ’అని ఏఎఫ్‌ఏ తెలిపింది. కేరళలో ఎవరితో ఆడతామనేది వెల్లడించలేదు.

మెస్సీ 2011లో చివరిసారిగా భారత్‌కు వచ్చాడు. ఇండియాలో కూడా అతనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడు కోల్‌కతాలోల వెనెజులాతో ఆడగా ఆ మ్యాచ్‌కు 70 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. కొన్ని రోజులుగా మెస్సీ పర్యటన గురించి పలు వార్తలు ట్రెండింగ్‌‌లో ఉన్నాయి. జూన్‌లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం మెస్సీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పడంతో మెస్సీ రాక గురించి కథనాలు మొదలయ్యాయి. ఇటీవల మెస్సీ డిసెంబర్‌లో భారత్‌కు రానున్నట్టు ఓ వార్త బయటకొచ్చింది. కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీలో పర్యటిస్తాడని, ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశంతో అతని పర్యటన ముగుస్తుందని ఆ వార్త సారాంశం. దానిపై ఏఎఫ్‌ఐ క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఆ వార్తలు పుకార్లేనని తాజా ప్రకటనతో అర్థమవుతుంది.


Next Story