న్యూజిలాండ్ తో ఆడే భార‌త జ‌ట్టు ఇదే..ఆ న‌లుగురికి నో ఛాన్స్ !

by velandi.Saikiran |   (  Updated:2026-01-02 18:19:33  IST  )

భార‌త్, కివీస్ మ‌ధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 3న లేదా ఎల్లుండి భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.

న్యూజిలాండ్ తో ఆడే భార‌త జ‌ట్టు ఇదే..ఆ న‌లుగురికి నో ఛాన్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్ మరో పోరుకు సిద్ధమైంది. 2026 సంవత్సరంలో న్యూజిలాండ్ జట్టుతో కొత్త సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ రెండు జట్ల మధ్య జనవరి 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 3న లేదా ఎల్లుండి భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది అనే అంశంపై రకరకాల వార్తలు వస్తున్నాయి.

మెడ నొప్పితో గాయపడి జట్టుకు దూరమైన గిల్ మళ్లీ జట్టులోకి రాబోతున్నాడట. అతడే ఈ సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడని సమాచారం. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ తుది జట్టులో స్థానం దక్కించుకుంటారు. శ్రేయాస్ అయ్యర్ కూడా రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడట. హార్దిక్ పాండ్యా, బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోసారి రుతురాజ్, జైష్వాల్ కు అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.

భార‌త జ‌ట్టు అంచ‌నా: శుభ్‌మన్ గిల్ (C), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్ష‌ర్, కెఎల్ రాహుల్, జడేజా, కుల్దీప్, అర్ష్‌దీప్, షమీ, హర్షిత్ రాణా, సుందర్, నితీష్, ఇషాన్ కిషన్/ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ‌.

Next Story