భారత జట్టును నడిపించడం గొప్ప బాధ్యత: శుభ్‌మన్‌ గిల్‌

by Malleboina Mahesh |

త్వరలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఇందులో భాగంగా భారత వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది.

భారత జట్టును నడిపించడం గొప్ప బాధ్యత: శుభ్‌మన్‌ గిల్‌
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఇందులో భాగంగా భారత వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే జట్టులో సీనియర్లు అయిన రోహిత్, విరాట్ కోహ్లీ కి స్థానం కల్పించినప్పటికీ..ODI కెప్టెన్ బాధ్యతలు మాత్రం గిల్ కి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే వన్డే భాద్యతలను తనకు అప్పగించడంపై గిల్ స్పందించాడు. భారత జట్టును నడిపించడం ఒక “పెద్ద బాధ్యత” అని, జట్టుకు సాధ్యమైనంత ఎక్కువ విజయాలు అందించడానికి ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నాడు.

దిల్లీ అరుణ్‌ జేట్లీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో గిల్‌ మాట్లాడుతూ, “భారత జట్టును నడిపించడం చాలా పెద్ద గౌరవం. ఈ అవకాశాన్ని ఎంతో ఉత్సాహంగా స్వీకరిస్తున్నాను. గత కొన్ని నెలలు నాకు చాలా ప్రత్యేకంగా గడిచాయి. ఇక ముందు ఉన్న ప్రతి సవాలును జట్టుగా ఎదుర్కొని విజయాలను సాధించడం నా ప్రధాన లక్ష్యం,” అని ఈ సందర్భంగా గిల్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవిచంద్రన్‌ అశ్విన్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు టెస్ట్‌ క్రికెట్‌ నుంచి విరమణ చేసిన నేపథ్యంలో గిల్‌ కొత్త తరం జట్టును తన నాయకత్వ లక్షణాలతో ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు భారత బ్యాటింగ్‌ మూలస్థంభాలుగా ఉన్నారు.

Next Story