Thailand Open: లక్ష్యసేన్ అవుట్.. గాయత్రి, ట్రీసా జోడీ ముందంజ

by Phanindra |

థాయ్‌ల్యాండ్ ఓపెన్‌ మొదటి రౌండ్‌లోనే లక్ష్యసేన్ తప్పుకున్నాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి, ట్రీసా జోడీ ముందంజ వేసింది.

Thailand Open: లక్ష్యసేన్ అవుట్.. గాయత్రి, ట్రీసా జోడీ ముందంజ
X

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌ మరో ఓటమి చవిచూశాడు. థాయ్‌ల్యాండ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన నాట్ గుయెన్ చేతిలో 18-21, 21-9, 17-21 తేడాతో లక్ష్యసేన్ ఓటమి చవిచూశాడు. వరల్డ్ 33వ ర్యాంక్ ప్రియాన్షు రజావత్ కూడా ఇండోనేషియాకు చెందిన ఆల్వి ఫర్హాన్ చేతిలో 13-21, 21-17, 16-21 తేడాతో ఓడి మొదటి రౌండ్‌లోనే తప్పుకున్నాడు.

మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 21-12, 13-21, 21-17 తేడాతో టర్కీకి చెందిన నెసిలాన్‌ ఆరిన్‌ను ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టింది. అలాగే ఆకర్షి కశ్యప్ 21-16, 20-22, 22-20 తేడాతో జపాన్‌కు చెందిన కోరు సుగియామాను ఓడించగా.. ఉన్నతి హుడా 21-14, 18-21, 23-21 తేడాతో థాయ్‌ల్యాండ్‌కు చెందిన థమోన్వన్ నితిట్టిక్రాయ్‌ను ఓడించి ముందంజ వేసింది.

మహిళల డబుల్స్‌లో ప్రపంచ పదో ర్యాంక్ గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ 21-15, 21-13 తేడాతో మలేషియాకు చెందిన ఆంగ్, టింగ్ జోడీని వరుస గేమ్స్‌లో మట్టికరిపించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. చివర్లో మలేషియాకు చెందిన జస్టిన్ హోను భారత షట్లర్ తరుణ్ మన్నెపల్లి 21-19, 21-16 తేడాతో వరుస గేమ్స్‌లో ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.

అయితే రక్షిత శ్రీ సంతోష్ రామ్‌రాజ్, అనుపమ ఉపాధ్యాయ ఓడిపోవడంతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. మహిళల డబుల్స్‌లో కే సెల్వమ్, ఎస్ సింఘీ‌ జోడీ, పురుషుల డబుల్స్‌లో పి కృష్ణమూర్తి రాయ్, ఎస్ ప్రతీక్ ఓటమి చవిచూశారు.

Next Story