- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒలింపిక్స్-2028లో భారత్, పాక్ మ్యాచ్ లేనట్టే?
2028లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : 2028లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన విషయం తెలిసిందే. 1900 తర్వాత తొలిసారిగా విశ్వక్రీడల్లో క్రికెట్‌ను చూడబోతున్నాం. అయితే ఒలింపిక్స్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగడం అనుమానమే. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఐసీసీ మీటింగ్‌లో ఒలింపిక్స్‌పై చర్చ జరిగింది. లాస్ ఏంజిల్ విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల ఈవెంట్లలో ఆరేసి జట్లు పాల్గొనబోతున్నాయి. జట్ల ఎంపికపై ఐసీసీ నిబంధనలను రూపొందించింది. ర్యాంకింగ్స్ ఆధారంగా కాకుండా ప్రతి ఖండం నుంచి టాప్ ర్యాంక్ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుందని ఐసీసీ మీటింగ్‌లో పాల్గొన్న ఓ సీనియర్ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు. రోడ్‌మ్యాప్ దాదాపుగా ఖరారైందని, త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను ఐసీసీ తెలియజేస్తుందని చెప్పారు.
ప్రస్తుత ర్యాంకింగ్స్ ఆధారంగా ఆసియా నుంచి భారత్, యూరోప్ నుంచి ఇంగ్లాండ్, ఆఫ్రికా నుంచి సౌతాఫ్రికా, ఓషినియా నుంచి ఆస్ట్రేలియా క్వాలిఫై అవుతాయి. ఐదో జట్టుగా ఆతిథ్య దేశమైన అమెరికాకు చాన్స్ దక్కొచ్చు. ఇక, ఆరో జట్టు కోసం క్వాలిఫయర్ నిర్వహించనున్నారు. ఆసియాలో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్‌దే టాప్ ర్యాంక్. దీంతో పాక్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువే. కాబట్టి, విశ్వక్రీడల్లో భారత్, పాక్ పోరు లేనట్టే. అయితే, క్వాలిఫై అయ్యేందుకు పాక్‌కు గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా చాన్స్ దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇంకా క్వాలిఫయర్‌కు జట్లను ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత లేదు.






