- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుల్దీప్, ప్రసిద్ద్ సూపర్ ఫామ్.. ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్లు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలకమైన మూడో వన్డే వైజాగ్ వేదికగా జరుగుతుంది. దాదాపు 20 మ్యాచులతో తర్వాత టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో.. సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలకమైన మూడో వన్డే వైజాగ్ వేదికగా జరుగుతుంది. దాదాపు 20 మ్యాచులతో తర్వాత టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో.. సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచులో ఒక్క 1 పరుగు వద్దనే ఫస్ట్ వికెట్ కోల్పోయిన తర్వాత కెప్టెన్ బావుమా, ఓపెనర్ డికాక్.. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. నిలకడగా ఆడుతూ.. ఫోర్లు సిక్సర్లు బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు కలిసి రెండో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించగా.. బావుమా 48 పరుగులకు అవుట్ అయ్యాడు. అనంతరం డికాక్ సెంచరీ చేయగా.. మరో బ్యాటర్ బ్రీట్జ్ క్రీజులో పాతుకుపోయాడు.
ఈ సమయంలో బౌలింగ్ కు వచ్చిన ప్రసిద్ద్ కృష్ణ 28 వ ఓవర్లో బ్రీట్జ్, మార్క్రమ్ లను వెంట వెంటనే అవుట్ చేశాడు. అనంతరం కొద్ది సేపటికి లెగ్ స్పీనర్ కుల్దీప్ యాదవ్.. తన బౌలింగ్‌తో మాయజాలం చేశాడు. 38వ ఓవర్లో బ్రెవిస్, మార్కో జెన్ సన్ ల వికెట్లను వెంట వెంటనే తీసుకున్నారు. అంతకు ముందు 106 ల వద్ద ఉన్న క్వింటన్ డికాక్ ను ప్రసిద్ధి కృష్ణన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 41 ఓవర్లకు వికెట్లు కోల్పోయి 245 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుంది.






