- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేడు KKR వర్సెస్ పంజాబ్ మ్యాచ్.. బలాబలాలు ఇవే

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ పంజాబ్ ( Punjab) కింగ్స్ జట్ల మధ్య ఇవాళ 44వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ ( Eden gardens) వేదిక కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 34 మ్యాచులు జరిగాయి.
ఇందులో కేకేఆర్ జట్టుదే పై చేయి కావడం గమనార్హం. ఈ 34 మ్యాచులలో 21 మ్యాచ్ లలో కేకేఆర్ విజయం సాధించింది. 13 మ్యాచ్ లలో మాత్రమే పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఇటు ఇవాళ మ్యాచ్ కూడా కేకేఆర్ సొంత గ్రౌండ్ లో జరుగుతోంది. కాబట్టి రహానే జట్టుకు మరింత అడ్వాంటేజ్ ఉండే ఛాన్సులు ఉన్నాయి.
జట్ల వివరాలు
కోల్కతా నైట్ రైడర్స్: క్వింటన్ డి కాక్ (w), సునీల్ నరైన్, అజింక్యా రహానే (C), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్ట్జే, వరుణ్ చకరవర్తి
పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (w), శ్రేయాస్ అయ్యర్ (C), నెహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్