మెస్సీ పర్యటన ఏర్పాట్లపై కోల్‌కతా గవర్నర్‌ సీరియస్‌

by Ajay Maddhiboyina |

గోట్ టూర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అర్జెంటీనా దిగ్గ‌జ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోన‌ల్ మెస్సీ క‌లాక‌తాలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

మెస్సీ పర్యటన ఏర్పాట్లపై కోల్‌కతా గవర్నర్‌ సీరియస్‌
X

దిశ, వెబ్ డెస్క్: గోట్ టూర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అర్జెంటీనా దిగ్గ‌జ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోన‌ల్ మెస్సీ క‌లాక‌తాలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నేడు ఉద‌యం కోల్ క‌తాలో ల్యాండ్ అయిన మెస్సీ త‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అయితే మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుడ్ బాల్ మ్యాడ్ ఆడాల్సి ఉండగా ఆడ‌కుండానే వెళ్లిపోయాడు. దీంతో ఎక్క‌డెక్క‌డి నుండో వ‌చ్చి గంట‌ల కొద్ది వేచి చూసిన అభిమానులు అస‌హ‌నానికి లోన‌య్యారు. స్టేడియంలో వాట‌ర్ బాటిళ్ల‌ను విసిరేశారు. కుర్చీల‌ను విర‌గ్గొడుతూ విసిరిప‌డేశారు.

అక్క‌డితో ఆగ‌కుండా స్టేడియంలో అన్నింటిని త‌గ‌ల‌బెడ‌తూ విధ్వంసం సృష్టించారు. బారికేడ్లు దాటుకుని చొచ్చుకుని వెళ్లే ప్ర‌య‌త్నం కూడా చేశారు. ఇక అభిమానులు గొడ‌వ చేయ‌డంతో మెస్సీ టీమ్ సొరంగం ద్వారా బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. టూర్ లో నిర్వ‌హ‌ణ లోపం ఉంద‌ని ఒప్పుకున్నారు. విచార‌ణ‌కు క‌మిటీని సైతం వేశారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ సైతం సీరియ‌స్ అయ్యారు. మెస్సీ ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై నివేదిక స‌మ‌ర్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.

Next Story