Virat Kohli : కోహ్లీ sorry చెప్పాలి : నెటిజన్స్ డిమాండ్

by Muthe.Rajitha |   (  Updated:2025-01-22 13:00:12  IST  )

టీంఇండియా(Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Virat Kohli : కోహ్లీ sorry చెప్పాలి : నెటిజన్స్ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : టీంఇండియా(Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటీవల కోహ్లీ చేసిన ఓ పనికి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ మధ్య ముంబై తాజ్ హోటల్(Mumbai Taj Hotel) ముందు కారు దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఓ CISF జవాన్ తన అభిమాన ఆటగాడితో సెల్ఫీ దిగాలని ప్రయత్నించాడు. కానీ కోహ్లీ వద్దని వారించడంతో జవాన్ నిరాశగా వెళ్ళిపోయాడు. అయితే విరాట్ నడుచుకుంటూ వెళ్ళడాన్ని రికార్డ్ చేస్తున్న మరో వ్యక్తి వీడియోలో ఈ తతంగం అంతా రికార్డ్ అయింది. ఆ వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. విరాట్ జవాన్ కు కనీస మర్యాద ఇవ్వలేదని, దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. వెంటనే విరాట్ కోహ్లీ జవాన్ కు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story