కోహ్లీ మరికొంత కాలం కొనసాగాల్సింది.. సయ్యద్‌ కిర్మాణి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

టీమిండియా (Team India) రన్ మిషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కోహ్లీ మరికొంత కాలం కొనసాగాల్సింది.. సయ్యద్‌ కిర్మాణి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా (Team India) రన్ మిషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్ట్‌లలో సుదీర్ఘ ఫార్మాట్‌కు కోహ్లీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు క్రీడా ప్రముఖులు అతడికి సోషల్ మీడియా (Social Media) వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. మరికొందరు రెడ్ బాల్ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలకడంపై భిన్నాభిప్రయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణీ (Syed Kirmani) మాట్లాడుతూ.. కోహ్లీ సారథ్యంలో 2016-2019 మధ్య కాలంలో ముఖ్యంగా విదేశాల్లో భారత్ అద్భుత విజయాలు సాధించిందని చెప్పుకొచ్చాడు. విరాట్‌కు క్రికెట్‌లో విస్తృత అనుభవం, సమాయానికి తగినట్లుగా గేమ్‌ ఛేంజర్‌గా మారే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని కొనియాడారు. కోహ్లీ కెరీర్‌లో టెస్ట్‌ క్రికెట్‌ ఇంకా మిగిలే ఉందని, మరికొంత కాలం రెడ్‌బాల్‌ క్రికెట్‌లో కొనసాగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ అనుభవం భారత క్రికెట్‌కు ఆస్తి లాంటిదని, సెలక్టర్లు కూడా అతడు తిరిగి ఫామ్‌లోకి వచ్చే వరకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని సయ్యద్‌ కిర్మాణి కామెంట్ చేశారు.

Next Story