- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ ఓటమిని ఒప్పుకోడు : మహ్మద్ కైఫ్
by Harish |
ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు.

X
దిశ, స్పోర్ట్స్ : ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లీ ఓటమిని ఓ పట్టాన ఒప్పుకోడని, చాంపియన్స్ ట్రోఫీలో అతను సత్తాచాటుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కైఫ్ తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘టెస్టుల్లో అతని ఆటను మర్చిపోండి. వైట్‌బాల్ క్రికెట్‌లో అతని ఆట భిన్నంగా ఉంటుంది. కోహ్లీ ఓటమిని అంగీకరించడు. తిరిగి రాణిస్తాడు. వన్డేల్లో అతని పేరిట 50 శతకాలు ఉన్నాయి. దాదాపు 13 వేల పరుగులు చేశాడు.’ అని తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీలో విరాట్ రాణిస్తాడని, దుబాయ్‌లో అతనికి మంచి రికార్డే ఉందన్నాడు. దుబాయ్‌లో చివరి మ్యాచ్‌లో అఫ్గాన్‌పై 61 మ్యాచ్‌ల్లోనే సెంచరీ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు.
- Tags
- #Kohli
Next Story






