IPL 2025: కోహ్లీ జెర్సీ నెంబర్ ఎఫెక్ట్.. ఈసారి టైటిల్ వాళ్లదే..!

by velandi.Saikiran |

ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB) ఫైనల్ కు చేరిన సంగతి

IPL 2025:  కోహ్లీ జెర్సీ నెంబర్ ఎఫెక్ట్.. ఈసారి టైటిల్ వాళ్లదే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB) ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగో సారి ఫైనల్ కు చేరిన.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం... ఎలాగైనా ఈసారి టైటిల్ గెలవాలని కసరత్తులు చేస్తోంది. ఒక్క అడుగు దూరంలో ఉన్న బెంగళూరు... జూన్ మూడో తేదీన తాడోపేడో తేల్చు కోబోతోంది.

ఇవాళ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians), పంజాబ్ కింగ్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు... బెంగళూరు తో ఫైనల్ లో ఆడనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... ఓ సెంటిమెంట్ బెంగళూరుకు కలిసి వచ్చేలా కనిపిస్తోంది.

ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ నెంబర్ 18 కాగా... కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 కావడం గమనార్హం. అలాగే ఫైనల్ జరిగే రోజు జూన్ 3, 2025. ఫైనల్ జరిగే తేదీని.. యాడింగ్ చేస్తే..18 నెంబర్ వస్తుంది. అది కూడా కోహ్లీ జెర్సీ నెంబరే కావడం గమనార్హం. దీంతో ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవడం గ్యారెంటీ అంటున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ వైరల్ చేస్తున్నారు.


Next Story