CSK ఫ్యాన్ పై కోహ్లీ ఫ్యాన్స్ దాడి.. వీడియో వైరల్ !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) జట్టు అత్యంత దారుణమైన

CSK ఫ్యాన్ పై కోహ్లీ ఫ్యాన్స్ దాడి.. వీడియో వైరల్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచింది. దీంతో ఈ టోర్నమెంట్ లో ఎలిమినేట్ అయిన మొట్ట మొదటి జట్టుగా చెత్త రికార్డు కూడా నమోదు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. బుధవారం రోజున పంజాబ్ చేతిలో దారుణంగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్... టోర్నమెంట్ నుంచి.. వైదొలగాల్సి వచ్చింది.

అయితే ఈ టోర్నమెంట్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఇంటి దారి పట్టడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్టు... అభిమానులు.. తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మరికొంతమంది విరాట్ కోహ్లీ ( Virat kohli) అభిమానులైతే రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన వీరాభిమాని పై దాడి కూడా చేశారు. శరవనన్ హరి ( Sharvanan Hari) చెన్నై అభిమానిపై కోహ్లీ అభిమానులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గ్రౌండ్ బయట... ఎల్లో జెర్సీ, ఎల్లో కలర్ రంగు పూసుకొని ఉన్న... హరిని పరిగెత్తించి మరి దారుణంగా కొట్టారు.

గత సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిందని.. హరి... సెలబ్రేషన్స్ చేసుకున్నారట. అయితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలిమినేట్ అయిన నేపథ్యంలో... దాడి చేసినట్టు చెబుతున్నారు. అయితే దీనిపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని పై దాడిని ఖండిస్తున్నారు. కోహ్లీ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.

Next Story