కీలక నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ

by Harish |

ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆడనున్నాడు.

కీలక నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్ : ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. ఢిల్లీ జట్టు తరపున అతను బరిలోకి దిగుతాడు. టోర్నీకి తాను అందుబాటులో ఉంటానని కోహ్లీ ఢిల్లీ డ్రిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కు తెలియజేశాడు. ఈ విషయాన్ని డీడీసీఏ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ ధ్రువీకరించారు. కోహ్లీ ఆడతానని చెప్పినట్టు తెలిపారు. కోహ్లీ, రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే దేశవాళీ ఆడాలని బీసీసీఐ వారికి సూచించింది. ఈ క్రమంలోనే ముంబై తరపున రోహిత్ ఆడతానని ఇప్పటికే స్పష్టతనిచ్చాడు. అయితే, కోహ్లీ మాత్రం ఆసక్తి చూపించడం లేదన్న వార్తలు రాగా.. అందులో నిజం లేదని తేలిపోయింది. విరాట్ 2010లో చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. ఈ నెల 24 నుంచి టోర్నీ ప్రారంభంకానుంది.


Next Story