కోహ్లీ డ‌కౌట్, రోహిత్ సింగిల్ డిజిట్‌..పీక‌ల్లోతు క‌ష్టాల్లో టీమిండియా

by velandi.Saikiran |

రోకో కాంబో ( RO-KO) కుప్ప కూలింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన రోహిత్ శర్మ, సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యాడు.kohli duck out

కోహ్లీ డ‌కౌట్, రోహిత్ సింగిల్ డిజిట్‌..పీక‌ల్లోతు క‌ష్టాల్లో టీమిండియా
X

దిశ‌, వెబ్ డెస్క్ : పెర్త్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తారు అనుకున్న రోకో కాంబో ( RO-KO) కుప్ప కూలింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన రోహిత్ శర్మ, సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యాడు. 14 బంతులు ఆడిన రోహిత్ శర్మ ఒక బౌండరీ సాధించి, ఎనిమిది పరుగులకే ఔట్ అయ్యాడు. అటు విరాట్ కోహ్లీ 8 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.

అదిరిపోయేలా బ్యాటింగ్ చేస్తారనుకుంటే, కోహ్లీ, రోహిత్‌ ఇలా ఔట్ అయ్యారేంటి ? అంటూ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ రోకో కాంబినేషన్ ఔట్ అయిన తర్వాత టీమిండియా కొత్త కెప్టెన్ గిల్ కూడా వెంటనే పెవిలీయ‌న్ కు వెళ్ళిపోయాడు. కేవలం 10 పరుగులు చేసిన‌ గిల్, క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 8.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 25 పరుగులు మాత్రమే చేసింది. ప్ర‌స్తుతం అయ్య‌ర్, అక్ష‌ర్ ప‌టేల్ క్రీజులో ఉన్నారు.




Next Story