- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్‌కోట్ టెస్టుకు రాహుల్ దూరం.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
by Harish |
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు.

X
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం ధ్రువీకరించింది. ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతను రాజ్‌కోట్ మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని తెలిపింది. ‘రాహుల్ 90 శాతం మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. 4వ, 5వ టెస్టులకు పూర్తిగా ఫిట్‌నెస్ సాధించే వరకు అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో కోలుకుంటాడు.’ అని బోర్డు పేర్కొంది. మూడో టెస్టు కోసం రాహుల్ స్థానంలో కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
- Tags
- #ind vs eng
Next Story






