- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KL Rahul : భారత్ ఏ జట్టులోకి KL రాహుల్, మహమ్మద్ సిరాజ్
లక్నో వేదికగా మల్టీ-డే మ్యాచ్ భారత్ A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య జరుగుతోంది. దీనికి సంబంధించిన రెండో మల్టీ-డే మ్యాచ్ కోసం భారతదేశం A జట్టులో KL రాహుల్, మహమ్మద్ సిరాజ్‌లకు చోటు కల్పించారు.

దిశ, వెబ్ డెస్క్: లక్నో వేదికగా మల్టీ-డే మ్యాచ్ (multi-day match) సిరీస్ భారత్ A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య జరుగుతోంది. దీనికి సంబంధించిన రెండో మల్టీ-డే మ్యాచ్ కోసం భారతదేశం A జట్టులో KL రాహుల్ (KL Rahul), మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj)లకు చోటు కల్పించారు. మొదటి ఆట తర్వాత ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చేరనున్నారు. లక్నో వేదికగా ఈ రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సిరీస్ సెప్టెంబర్ 16, 2025 నుంచి ప్రారంభమవుతుంది, రెండవ మల్టీ-డే సెప్టెంబర్ 23, 2025 న ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కు ఇప్పటికే భారత జట్టు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను ప్రకటించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన ఇండియా A జట్టును లక్నోలో ఆస్ట్రేలియా Aతో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం ఈ రోజు ప్రకటించింది. సెప్టెంబర్ 9న UAEలో ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం భారత జట్టులో అయ్యర్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.






