- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన KL రాహుల్
టీమిండియా(Team India) ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) అరుదైన ఘనత సాధించారు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) అరుదైన ఘనత సాధించారు. టీ20 ఫార్మాట్‌లో వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసిన భారత అటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న ఈ రికార్డును కేఎల్ రాహుల్ బ్రేక్ చేశాడు. ఆదివారం ఐపీఎల్‌లో 2025లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఆరో భారత ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. రాహుల్ కంటే ముందు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ ఈ రికార్డు సాధించారు. అయితే 8 వేల పరుగులు చేయడానికి విరాట్ కోహ్లీ 243 ఇన్నింగ్స్ ఆడగా.. రాహుల్ కేవలం 224 ఇన్నింగ్స్‌లోనే సాధించారు. అత్యంత వేగంగా 8 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నెంబర్ వన్ ప్లేస్‌లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఉన్నారు. గేల్ 213 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను సాధించగా.. తర్వాత పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్(218) ఉండగా.. ఆ తర్వాతి స్థానానికి రాహుల్ ఎగబాకాడు. అంతేకాదు.. ఐపీఎల్‌లో 200 సిక్సులను పూర్తి రాహుల్ ఇవాళ పూర్తి చేసుకున్నారు.
🚨 HISTORY-MAKER KL RAHUL! 🚨
— Yogesh Goswami (@yogeshgoswami_) May 18, 2025
🔹Fastest Indian to 8000 T20 runs – in just 224 innings!
🔹Breaks Virat Kohli’s record (243 inns)!
🔹3rd fastest overall after Gayle (213) & Babar (218)!
🔹First Indian to do it in under 230 innings!
- What a milestone in #IPL2025!#KLRahul #DCvGT pic.twitter.com/LcGk8smgLj






