- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS SA : గిల్ ఔట్.. వన్డే కెప్టెన్‌గా రాహుల్
సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు బీసీసీఐ ఆదివారం భారత జట్టును ప్రకటించింది.

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు బీసీసీఐ ఆదివారం భారత జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్టే కెప్టెన్ గిల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.తొలి టెస్టులో మెడనొప్పి గాయానికి గురైన అతను ఇంకా కోలుకోలేదు. గిల్ గైర్హాజరీలో బీసీసీఐ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించింది. పంత్‌కు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వచ్చినా బోర్డు రాహుల్ వైపే మొగ్గుచూపింది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన పంత్ వన్డే టీంలోకి కూడా పునరాగమనం చేశాడు. గిల్ దూరం కావడంతో రోహిత్‌తో కలిసి యశస్వి జైశ్వాల్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు రానున్నాడు. బ్యాకప్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కింది. తిలక్ వర్మ తిరిగి వన్డే జట్టులోకి రాగా.. నితీశ్ కుమార్ రెడ్డి స్థానం పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో పర్యటనలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. హార్దిక్ పాండ్యా కూడా గాయం కారణంగా అందుబాటులో లేడు. స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు రెస్ట్ ఇచ్చారు. రవీంద్ర జడేజా రీఎంట్రీతో మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కనపెట్టారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ నెల 30న తొలి మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 3, 6 తేదీల్లో మిగతా రెండు వన్డేలు జరగనున్నాయి. మూడో వన్డేకు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది.
భారత వన్డే జట్టు
రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్), రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.






