- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ బిగ్ స్కెచ్...ఈ డేంజర్ ప్లేయర్లు ఔట్ ?
దీంతో తమ రిటెన్షన్ ప్లేయర్ల లిస్టును సిద్ధం చేస్తున్నాయి 10 ఫ్రాంచైజీలు. ఇక ఐపీఎల్ 2026 టోర్నమెంట్

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కు సంబంధించిన కీలక అప్డేట్ తాజాగా వెలువడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13 నుంచి 15 మధ్య ఐపీఎల్ మినీ వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో నవంబర్ 15వ తేదీ లోపు రిటెన్షన్ ప్లేయర్ల లిస్టులో ఫైనల్ చేయాలని 10 ఫ్రాంచైజీలకు ఐపీఎల్ యాజమాన్యం నుంచి ఆదేశాలు వెళ్ళాయట.
దీంతో తమ రిటెన్షన్ ప్లేయర్ల లిస్టును సిద్ధం చేస్తున్నాయి 10 ఫ్రాంచైజీలు. ఇక ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కేకేఆర్ జట్టు కూడా భారీ ప్లాన్ వేస్తోంది. గత సీజన్ లో దారుణంగా విఫలమైన ప్లేయర్లను వదిలివేయాలని కేకేఆర్ యాజమాన్యం అనుకుంటోందట. ఇందులో భాగంగానే ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్ ను వదిలివేయాలని డిసైడ్ అయ్యారట. వీళ్లతో పాటు మరో ఐదుగురిని కూడా వదిలేసేందుకు సిద్ధమయ్యారట. అయితే ఇద్దరి పేర్లు మాత్రం బయటకు వచ్చాయి. త్వరలోనే మిగతా ప్లేయర్ల పేర్లు కూడా ఫైనల్ చేయనున్నారు. దీంతో కేకేఆర్ అభిమానులు తీవ్ర నిరాశ లో ఉన్నట్లు తెలుస్తోంది. మంచి హిట్టర్లనే జట్టు వదిలేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.






