కెనడా ఓపెన్‌లో శ్రీకాంత్ జోరు.. వరల్డ్ నం.6కు షాక్

by Harish |

కెనడా ఓపెన్‌లో శ్రీకాంత్ జోరు.. వరల్డ్ నం.6కు షాక్
X

దిశ, స్పోర్ట్స్ : కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అదరగొడుతున్నాడు. మెన్స్ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అతను వరల్డ్ నం.6 చౌ టియెన్ చెన్‌కు షాకిచ్చాడు. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్ 21-18, 21-9 తేడాతో విజయం సాధించాడు. 43 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌‌లో రెండు గేముల్లోనే సొంతం చేసుకున్నాడు. తొలి గేముల్లో కాస్త శ్రమించినా.. రెండో గేములో మాత్రం పూర్తి హవా శ్రీకాంత్‌దే. ఈ ఏడాది మేలో మలేసియా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ మరో ఫైనల్ దిశగా సాగుతున్నాడు. సెమీస్‌లో అతను జపాన్ షట్లర్ కెంటో నిషిమోటోతో తలపడనున్నాడు. మరోవైపు, భారత యువ షట్లర్ శంకర్ సుబ్రమణియన్ సంచలన పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌లో అతను పరాజయం పాలయ్యాడు. జపాన్ ప్లేయర్ నిషిమోటో చేతిలో 21-15, 5-21, 2-17 తేడాతో పోరాడి ఓడాడు.


Next Story