శ్రీకాంత్‌కు నిరాశ.. మలేసియా మాస్టర్స్ ఫైనల్‌లో బోల్తా

by Harish |

మలేసియా మాస్టర్స్ టైటిల్ దిశగా సాగిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌లో బోల్తాపడ్డాడు.

శ్రీకాంత్‌కు నిరాశ.. మలేసియా మాస్టర్స్ ఫైనల్‌లో బోల్తా
X

దిశ, స్పోర్ట్స్ : మలేసియా మాస్టర్స్ టైటిల్ దిశగా సాగిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌లో బోల్తాపడ్డాడు. ఆరేళ్ల తర్వాత ఓ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాన్న ఆనందం టైటిల్‌ పోరులో ఆవిరైంది. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో శ్రీకాంత్‌ 11-9, 21-9 తేడాతో చైనా ఆటగాడు లీ షిఫెంగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఫైనల్‌కు ముందు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి శ్రీకాంత్ ఎదురులేకుండా కనిపించాడు. అయితే, టైటిల్ పోరులో మాత్రం అతను దారుణంగా నిరాశపరిచాడు. ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో తడబడ్డాడు. కనీసం పోటీ ఇవ్వలేకపోయాడు. కేవలం 36 నిమిషాల్లోనే రెండు గేములను కోల్పోయి రన్నరప్‌గా సరిపెట్టాడు. 2017లో శ్రీకాంత్ చివరిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు. ఆ తర్వాత మరో టైటిల్ సాధించలేకపోయాడు. 2019లో ఇండియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నా అక్కడా బోల్తాపడ్డాడు. ఇన్నేళ్ల తర్వాత ఓ టోర్నీలో ఫైనల్‌లో అడుగుపెట్టగా శ్రీకాంత్‌కు నిరాశే ఎదురైంది. అయితే, కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేసిన శ్రీకాంత్‌కు మలేసియా మాస్టర్స్‌లో ఫైనల్‌ వరకు చేరుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే.


Next Story