- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తాం..కానీ మ్యాచ్ మాత్రం వద్దు - కేదార్ జాదవ్
పాకిస్తాన్ పైన మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా టీమిండియానే గెలుస్తుంది... వ్యాఖ్యానించారు కేదార్ జాదవ్.

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరగకూడదని.. రద్దు చేసుకోవాలని బీసీసీఐని టీమిండియా మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. ఇప్పటికే హర్భజన్ లాంటి ప్లేయర్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా కేదార్ జాదవ్ ( Kedar Jadhav ) కూడా ఈ అంశంపై స్పందించారు.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగకపోవచ్చు అని.. తాను అనుకుంటున్నట్లు కేదార్ జాదవ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ పైన మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా టీమిండియానే గెలుస్తుంది... కానీ ఈ మ్యాచ్ జరగడానికి వీలు లేదంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో... భారత జవాన్లు అలాగే అమాయక ప్రజలు చనిపోయారని గుర్తు చేస్తూ.. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని కోరారు కేదార్ జాదవ్. మరి దీనిపై బీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.






