- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌లో గురువారం జరిగిన ‘ది హండ్రెడ్’ లీగ్ వేలంలో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ రూ.2.34 కోట్లకు జట్టులోకి తీసుకుంది. మరో ఫ్రాంచైజీ ట్రెంట్ రాకెట్స్‌తో పోటీపడి మరి అతన్ని దక్కించుకుంది. వేలంలో కావ్యా మారన్ కూడా పాల్గొంది. 2009లో ఐపీఎల్ నుంచి పాక్ క్రికెటర్లను నిషేధం విధించినప్పటి నుంచి ఓ పాక్ క్రికెటర్‌తో భారత్‌కు చెందిన ఫ్రాంచైజీ ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. అబ్రార్‌ను ‘సన్‌రైజర్స్’ కొనుగోలు చేయడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అబ్రార్ భారత్‌ను అవమానించాలే పోస్టు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. కావ్య మారన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. వేలంలో 13 మంది పాక్ ప్లేయర్లు పాల్గొన్నారు. మరో స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్ సొంతం చేసుకుంది. హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్‌లపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.






