కావ్య మారన్ జోరు...అత‌నికి హ‌గ్ ఇచ్చి మ‌రీ !

by velandi.Saikiran |

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ స్ట‌బ్స్ కు హగ్ కూడా ఇచ్చింది కావ్య.

కావ్య మారన్ జోరు...అత‌నికి హ‌గ్ ఇచ్చి మ‌రీ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2026 నేపథ్యంలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్ గా నిలిచింది. ఆదివారం రోజున జరిగిన ఫైనల్ లో ప్రిటోరియా క్యాపిట‌ల్స్‌ జట్టును చిత్తుగా ఓడించింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. దీంతో దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ఇప్పటి వరకు మూడో టైటిల్ అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో 2023, 2024 సీజన్లల‌లో వరుసగా టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఈ ఏడాది మరోసారి టైటిల్ అందుకుంది. 2025లో ఫైనల్ దాకా వెళ్లి నిరాశ చెందిన కావ్య మార‌న్‌ జట్టుకు ఈసారి మాత్రం బంపర్ ఆఫర్ తగిలింది.

ప్లేయర్లతో సందడి చేసిన కావ్య మార‌న్‌

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2026 ఛాంపియన్ గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచిన నేపథ్యంలో ఓనర్ కావ్య మార‌న్‌ సంబరాలు చేసుకున్నారు. ప్లేయర్లతో కలిసి ఆమె కూడా ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ స్ట‌బ్స్ కు హగ్ కూడా ఇచ్చింది కావ్య. దీనికి సంబంధించిన ఫోటో, వీడియో వైరల్ గా మారింది.

Next Story