- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్ అయిపోయి లీగ్స్ ఆడుకో.. కరుణ్ నాయర్‌కు ప్రముఖ క్రికెటర్ సలహా!
టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత తనను రిటైర్ అయిపోవాలని ఒక ప్రముఖ క్రికెటర్ చెప్పినట్లు కరుణ్ నాయర్ వెల్లడించాడు.

దిశ, స్పోర్ట్స్: అద్భుతమైన ఆటతో టీమిండియాలో పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ సంచలన విషయం వెల్లడించాడు. రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ క్రికెటర్ తనను రిటైర్ అవ్వాలని సూచించినట్లు చెప్పాడు. ‘ఒక ప్రముఖ క్రికెటర్ నాకు కాల్ చేశాడు. లీగ్ క్రికెట్ ఆడితే వచ్చే డబ్బులతో సెక్యూర్డ్ జీవితం గడపొచ్చు. ఇక రిటైర్ అయిపోయి లీగ్స్ మీద ఫోకస్ పెట్టు’ అని సలహా ఇచ్చినట్లు నాయర్ వెల్లడించాడు. అలా చేయడం సులభమే అయినా, ఆ పని చేస్తే ఫ్యూచర్‌లో తను చాలా బాధ పడతానని, అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాడీ 33 ఏళ్ల క్రికెటర్.
‘భారత్‌కు ఆడే అవకాశం ఉన్నంత వరకు నేను ఆ ఛాన్స్ వదులుకోను. ఇది జరిగి రెండేళ్లయింది. ఇప్పుడు నా కల నిజమైంది కదా. ఇదంతా నమ్మశక్యంగా ఉండదు. కానీ నేను మంచి ప్లేయర్‌ను అని నాకు తెలుసు’ అని నాయర్ వెల్లడించాడు. దేశవాళీల్లో నిలకడగా అదిరిపోయే ఇన్నింగ్సులు ఆడిన నాయర్.. అన్ని ఫార్మాట్లలో చెలరేగాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. మొదటి ప్రాక్టీస్ మ్యాచులో డబుల్ సెంచరీతో మెరిసి, జూన్ 20న జరిగే తొలి టెస్టులో తన స్థానం దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నాడు.






