స్టోక్స్.. ఆలోచించి మాట్లాడాడు : అశ్విన్

by Harish |

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రతిపాదినను హ్యాస్యాస్పదంగా ఉందన్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఫైర్ అయ్యాడు.

స్టోక్స్.. ఆలోచించి మాట్లాడాడు : అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : టెస్టు క్రికెట్‌లో ఇంజూరీ రిప్లేస్‌మెంట్ ఉండాలన్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రతిపాదినను హ్యాస్యాస్పదంగా ఉందన్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఫైర్ అయ్యాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. స్టోక్స్ ఆలోచించి మాట్లాడాలన్నాడు. కర్మ ఎవరినీ వదలిపెట్టదని, వెంటనే బదులిస్తుందని కౌంటర్ ఇచ్చాడు.

అసలేం జరిగిందంటే.. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో పంత్ గాయపడిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో గాయంతోనే బ్యాటింగ్ చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. అప్పుడు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టెస్టుల్లో ఇంజూరీ రిప్లేస్‌మెంట్‌ ప్రతిపాదన చేశాడు. గంభీర్ వ్యాఖ్యలపై స్టోక్స్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. ఆ ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉందన్నాడు. అయితే, ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌‌ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. ఆ జట్టు బౌలర్ క్రిస్ వోక్స్ భుజానికి గాయం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. కానీ, చేజింగ్‌లో ఇంగ్లాండ్ విజయానికి 20 రన్స్ దూరంలో ఉన్నప్పుడు వోక్స్ ఒంటి చెత్తే మైదానంలోకి వచ్చాడు.

పంత్, వోక్స్ ఘటనలను ఉద్దేశిస్తూ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. ‘కర్మ వెంటనే ప్రభావం చూపుతుంది’అనే అర్థం వచ్చేలా తమిళంలో ఓ సామెత ఉంది. మనం ఏం విత్తితే.. ఆ పంటను కోస్తాం. స్టోక్స్ క్రికెట్ నైపుణ్యాలకు నేను అభిమానిని. కానీ, అతను ఆలోచించి సమాధానం ఇవ్వాల్సింది. ఇతర జట్లపై కాస్త సానుభూతి ఉండాలి. జోక్, హాస్యాస్పదంట వంటి పదాలు గౌరప్రదమైనవి కావు. ఆలోచించి మాట్లాడాలి. లేదంటే కర్మ వెంటనే ప్రభావం చూపుతుంది.’అని అశ్విన్ గట్టిగా స్పందించాడు.


Next Story