Kajal Aggarwal: కాజల్ కొడుకును చూసారా.. ఇదిగో వీడియో

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో

Kajal Aggarwal: కాజల్ కొడుకును చూసారా.. ఇదిగో వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగి... చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు తీసింది. పెళ్లయిన తర్వాత సినిమాలు తగ్గించినప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయని కాజల్ అగర్వాల్.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

ఇక తాజాగా... తన కొడుకుతో ( KajalAggarwal Son ) మెరిసింది కాజల్ అగర్వాల్. ముంబై విమానాశ్రయానికి తన కొడుకుతో కలిసి వచ్చింది కాజల్ అగర్వాల్.. కారులో దిగుతూ విమానాశ్రయం లోపలికి.. కాజల్ అలాగే ఆమె కొడుకు ఇద్దరు వెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో.. కాజల్ కొడుకు.. హీరోలా కనిపించాడు. అటు కాజల్ అగర్వాల్ వైట్ టీ షర్ట్, బ్లూ జీన్ వేసుకొని కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోని చూసిన ఆమె అభిమానులు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ కొడుకు అందంగా ఉన్నాడని.. అచ్చం హీరోలా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అంత పెద్ద కొడుకు ఉన్నప్పటికీ.. కాజల్ అగర్వాల్ అందం ఏమాత్రం తగ్గలేదని మరి కొంత మంది అంటున్నారు.

Next Story