భారత జాతీయ జట్టుకు ఎంపికైన తెలుగమ్మాయి శ్రీచరణి

by Harish |

తెలుగమ్మాయి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎన్.శ్రీ చరణికి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది.

భారత జాతీయ జట్టుకు ఎంపికైన తెలుగమ్మాయి శ్రీచరణి
X

దిశ, స్పోర్ట్స్ : తెలుగమ్మాయి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎన్.శ్రీ చరణికి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల చివర్లో శ్రీలంకలో జరిగే ట్రై సిరీస్‌కు ప్రకటించిన భారత మహిళల జట్టులో ఆమెకు చోటు దక్కింది. భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య ఈ నెలలో చివర్లో వన్డే ట్రై సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఐర్లాండ్ టూరుకు దూరంగా ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తిరిగి పగ్గాలు చేపట్టింది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో శ్రీచరణి ఆకట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రెండే మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీసింది. శ్రీచరణితోపాటు పేసర్ కాశ్వీ గౌతమ్, స్పిన్నర్ శుచి ఉపాధ్యాయ తొలిసారిగా జాతీయ జట్టులో చోటు సంపాదించారు. మరో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి తిరిగి వన్డే జట్టులోకి వచ్చింది. స్నేహ్ రాణా, యాస్తికా భాటియా, అమన్‌జోత్ కౌర్ కూడా కమ్ బ్యాక్ ఇచ్చారు. బ్యాటర్ షెఫాలీ వర్మకు మరోసారి నిరాశే ఎదురైంది. డబ్ల్యూపీఎల్‌‌లో 304 రన్స్‌తో సత్తాచాటినప్పటికీ ఆమెను పక్కనపెట్టడం గమనార్హం. ట్రై సిరీస్‌లో భాగంగా ఈ నెల 27న శ్రీలంకతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.

భారత మహిళల క్రికెట్ జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, ప్రాతిక రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, తేజాల్ హసబ్నిస్, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ

Next Story