జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ బోణీ.. నమీబియాపై 13-0తో భారీ విజయం

by Harish |

జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ బోణీ.. నమీబియాపై 13-0తో భారీ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : చిలీలో జరుగుతున్న మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌ను భారత జట్టు ఘనంగా మొదలుపెట్టింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో నమీబియాపై 13-0తో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆరంభం నుంచి భారత అమ్మాయిలు దూకుడుగా ఆడారు. ఎటాకింగ్ గేముతో వరుసగా గోల్స్ చేశారు. కనిక సివాచ్, హినా బానో చెరో 3 గోల్స్‌తో అదరగొట్టారు. సాక్షి రాణా రెండు గోల్స్ చేయగా.. బినిమా ధన్, సోనమ్, సాక్షి శుక్లా, ఇషిక, మనిషా చెరో గోల్ చేశారు. భారత్ దూకుడు ముందు తేలిపోయిన నమీబియా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఆ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేదు. బుధవారం భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో జర్మనీతో తలపడనుంది.


Next Story