టీమిండియాలో బుమ్రానే అతిపెద్ద స్టార్.. యూనిక్ బౌలింగ్‌తో ఇబ్బంది: బట్లర్

by Phanindra |

టీమిండియాలో బుమ్రానే అతిపెద్ద స్టార్ అని బట్లర్ అన్నాడు. తన యూనిక్ బౌలింగ్‌తో చాలా ఇబ్బంది పెడతాడని చెప్పాడు.

టీమిండియాలో బుమ్రానే అతిపెద్ద స్టార్.. యూనిక్ బౌలింగ్‌తో ఇబ్బంది: బట్లర్
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో అతిపెద్ద క్రికెట్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా అని ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ చెప్పాడు. ఇంగ్లండ్ మాజీ లెజెండ్ స్టువర్ట్ బ్రాడ్‌తో ఒక పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడిన బట్లర్.. బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బుమ్రాను ఎదుర్కోవడం చాలా కష్టం. తన రన్నప్, బౌలింగ్ యాక్షన్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టే యాంగిల్స్ క్రియేట్ చేస్తాడు. బుమ్రా డెలివరీ పాయింట్ కూడా మామూలు బౌలర్ల కన్నా ఒక అడుగు ముందుకు ఉంటుంది. దాంతో బంతి చాలా వేగంగా వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది’ అని బట్లర్ వివరించాడు.


ఇక తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా పంచుకున్న ఈ ఇంగ్లండ్ స్టార్.. ‘ఒక రైట్ హ్యాండర్‌గా నన్ను బుమ్రా చాలాసార్లు బోల్తా కొట్టించాడు. బంతి ఇన్‌స్వింగర్ అని అనుకున్న చాలాసార్లు అది అవుట్ సైడ్ స్వింగ్ అయ్యేది. ఒక బ్యాటర్‌గా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి’ అని చెప్పాడు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో వెన్నుగాయంతో తప్పుకున్న బుమ్రా.. కోలుకున్న తర్వాత ఇంగ్లండ్ సిరీసుతోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Next Story