- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో టెస్టు కోసం బలాన్ని పెంచుకున్న ఇంగ్లాండ్.. నాలుగేళ్ల తర్వాత ఆ ప్రమాదకరమైన బౌలర్ జట్టులోకి
టీమిండియాపై తొలి టెస్టు విజయంతో ఇంగ్లాండ్ జోరు మీద ఉన్నది.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాపై తొలి టెస్టు విజయంతో ఇంగ్లాండ్ జోరు మీద ఉన్నది. ఈ క్రమంలోనే రెండు టెస్టుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన ఇంగ్లాండ్ జట్టును గురువారం ప్రకటించింది. తొలి టెస్టుకు ఎంపిక చేసిన టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, ఆ జట్టులో పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను చేర్చారు. నాలుగేళ్ల తర్వాత ఆర్చర్ టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2021 ఫిబ్రవరిలో భారత్‌పై అతను చివరి టెస్టు ఆడాడు. తిరిగి భారత్‌పైనే పునరాగమనం చేయబోతున్నాడు. వరుస గాయాలతో ఇబ్బందిపడిన ఆర్చర్ గతేడాది వైట్‌బాల్ ఫార్మాట్‌లో పునరాగమనం చేశాడు. నాలుగేళ్లలో తొలిసారిగా ఇటీవల కౌంటీ చాంపియన్‌షిప్ ద్వారా రెడ్ బాల్ మ్యాచ్ ఆడాడు. అతని ఫిట్‌నెస్‌పై నిర్ధారణకు వచ్చిన తర్వాతే రెండో టెస్టుకు ఎంపిక చేశామని సెలెక్టర్ ల్యూక్ రైట్ తెలిపారు. ఆర్చర్ రాకతో ఇంగ్లాండ్ బౌలింగ్ దళం బలం పెరిగినట్టే. మరోవైపు, మరో ఫాస్ట్ బౌలర్ అట్కిన్సన్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. వచ్చే నెల 2 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.
ఇంగ్లాండ్ జట్టు : బెన్ స్టోక్స్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్,షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కార్సే, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జోరూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.






