- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెస్ట్ ర్యాంకింగ్స్...ముగ్గురు టీమిండియా ప్లేయర్లకు బిగ్ షాక్..దూసుకు వెళ్లిన రూట్
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి. ఈ టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం... టీమిండియా స్టార్ ఆటగాళ్లు ముగ్గురికి..

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి. ఈ టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం... టీమిండియా స్టార్ ఆటగాళ్లు ముగ్గురికి... నిరాశ ఎదురయింది. మొన్నటి వరకు ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో ఉన్న యశస్వి జైస్వాల్.. ఐదో స్థానానికి పడిపోయాడు. అలాగే రిషబ్ పంత్ ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి వచ్చాడు. ఇంకా టీమిండియా కెప్టెన్ గిల్ (Gill) ఏకంగా మూడు పాయింట్లు దిగజారాడు. ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు గిల్.
ఇక పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో రూట్ (Joe Root ) నిలిచాడు. ఆ తర్వాత కేన్ (Kane ) మామ రెండో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ (Harry Brook ) రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అదే సమయంలో బౌలర్ల లిస్టు పరిశీలిస్తే.. టీమిండియా స్టార్ ఆటగాడు బుమ్రా మొదటి స్థానం దక్కించుకున్నాడు. రెండో స్థానంలో కాగిసో రాబాడ నిలిచాడు. ఇక బుమ్రా (Bumrah) తర్వాత టాప్ 10లో ఏ ఒక్క టీమిండియా బౌలర్ లేడు.






