Joe Root: జో రూట్ మ‌రో సెంచ‌రీ..తొలి ప్లేయ‌ర్ గా రికార్డు

by velandi.Saikiran |

శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య కొలంబో వేదికగా ఇవాళ మూడవ వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది.

Joe Root: జో రూట్ మ‌రో సెంచ‌రీ..తొలి ప్లేయ‌ర్ గా రికార్డు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ( Joe Root ) సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడవ వన్డే మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసిన జో రూట్, ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య కొలంబో వేదికగా ఇవాళ మూడవ వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది.

ఇప్పటికే 300కు పైగా పరుగులు సాధించింది ఇంగ్లాండ్. ఈ నేపథ్యంలోనే మొదటి రెండు వన్డేలలో వరుసగా అర్థ సెంచరీలు నమోదు చేసిన జో రూట్, ఇవాళ మాత్రం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో వన్డేలలో 20 సెంచరీలు పూర్తి చేసిన తొలి ఇంగ్లాండ్ బ్యాటర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. 178 ఇన్నింగ్స్ ఆడిన జో రూట్, 20 సెంచరీలు నమోదు చేయగా, అతని తర్వాత ఇయాన్ మోర్గాన్ 13 సెంచరీలతో ఉన్నాడు. అదే సమయంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 61 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు జో రూట్. అటు విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 85 సెంచరీలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Next Story