WPL 2026: క‌న్నీళ్లు పెట్టుకున్న జెమిమా రోడ్రిగ్స్..బెంగ‌ళూరుకు ఫ్రైజ్ మనీ ఎంతంటే

by velandi.Saikiran |   (  Updated:2026-02-06 00:12:08  IST  )

రెండోసారి బెంగళూరు ఛాంపియన్ కాగా, ఆ జట్టుకు ఆరు కోట్లు ఇవ్వనుంది బీసీసీఐ. ప్రైజ్ మనీ కింద ఇవ్వనున్నారు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మూడు కోట్ల వరకు రాబోతున్నాయి.

WPL 2026: క‌న్నీళ్లు పెట్టుకున్న జెమిమా రోడ్రిగ్స్..బెంగ‌ళూరుకు ఫ్రైజ్ మనీ ఎంతంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చిత్తుగా ఓడించి బెంగళూరు, ట్రోఫీ గెలుచుకుంది. 2024లో ఇప్పటికే ఛాంపియన్ అయినా బెంగుళూరు, ఇప్పుడు మరోసారి చరిత్ర సృష్టించింది. అటు వరుసగా నాలుగో సారి ఫైనల్స్ ను ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు. ప్రతిసారి ఫైనల్ కు రావడం, ఆ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం జరుగుతోంది.

కన్నీళ్లు పెట్టుకున్న ఢిల్లీ కెప్టెన్..

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో బెంగళూరు విజేతగా నిలువగా ఢిల్లీ రన్నరప్ గా నిలిచింది. అయితే ఢిల్లీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే కన్నీళ్లు పెట్టుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో కొంత మంది జెమిమా రోడ్రిగ్స్ గురించి పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇది ఇలా ఉండగా రెండోసారి బెంగళూరు ఛాంపియన్ కాగా, ఆ జట్టుకు ఆరు కోట్లు ఇవ్వనుంది బీసీసీఐ. ప్రైజ్ మనీ కింద ఇవ్వనున్నారు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మూడు కోట్ల వరకు రాబోతున్నాయి. WPL 2026 లో ఇప్పటి వరకు మొత్తం నాలుగు టోర్నమెంట్లు పూర్తయ్యాయి. ఇందులో మొదట 2023లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ 2024లో తొలి టైటిల్ గెల్చుకుంది. కిందటి సీజన్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించగా, ఈ సారి బెంగళూరు గెలిచింది.

Next Story